వారెవ్వా ప్రజా పాలన.. శభాష్ ఇందిరమ్మ రాజ్యం- కేటీఆర్ 23 h ago
TG : నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో మంగళవారం విద్యార్థినులకు బ్రేక్ఫాస్ట్కు బదులు గొడ్డుకారం అన్నం అందించారు. ఈ ఘటన పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు 32వేలు మాత్రమే.. అదే చదువుకునే విద్యార్థులకు మాత్రం గొడ్డుకారంతో భోజనం పెడతారని విమర్శించారు. వారెవ్వా ప్రజా పాలన.. శభాష్ ఇందిరమ్మ రాజ్యం అంటూ కేటీఆర్ మండిపడ్డారు.